NTV Telugu Site icon

K. A. Paul: కొండా సురేఖ మాటలకు అమెరికాలో పరువు నష్టం దావా వేస్తారు..

Ka Paul

Ka Paul

K. A. Paul: ఇదే అమెరికా అయితే మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తారని మంత్రి కొండా సురేఖపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. కొండా సురేఖ వ్యాఖ్యలు మతిభ్రమించి, పిచ్చికుక్క కరిస్తే మాట్లాడినట్టు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలు చట్టవిరుద్ధం అని అన్నారు. ఇదే అమెరికా అయితే మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తారన్నారు. రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్య చేస్తే ఆయన పార్లమెంటు సభ్యత్వమే పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పోల్చితే కొండా సురేఖ వ్యాఖ్యలు 100 రెట్లు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఆమెకు నోటీసులు ఇచ్చి డీజీపీ ఎందుకు అరెస్టు చేయలేదు? అని ప్రశ్నించారు. ఇప్పుడు సారీ చెప్తే.. హత్య చేసి సారీ చెప్పినట్టుగా ఉందన్నారు. సమంతకు ఎంత మనోవేదన, ఆవేదన ఉంటాయో ఊహించారా? అని అన్నారు. కొండా సురేఖ రాజీనామా చేయాలి. 72 గంటల సమయం ఇస్తున్నా అన్నారు. లేదా తక్షణమే ఆమెను తొలగిస్తూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. సమంత ఇంటికి, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి గర్వం ఎక్కువై నేతలు ఇలా వ్యవహరిస్తున్నారు. కళ్ళు నెత్తిమీద ఉన్నాయని తెలిపారు.

Read also: Gold Rate Today: పండగ వేల షాక్‌లు ఇస్తున్న గోల్డ్.. నేడు తులం ఎంతుందంటే?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదానిని ఎందుకు కలిశారు? ఆ సమావేశంలో సునీల్ కనుగోలు ఎందుకు ఉన్నాడు? అని ప్రశ్నించారు. ప్రజలకు కూడా బుద్ధి లేదు.. రూ. 5,000/- తీసుకుని ఓట్లు వేస్తున్నారన్నారు. ఇకనైనా ఓటర్లు ఆలోచనతో ఓటేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని, మార్పు రావాలన్నారు.
కాంగ్రెస్ వద్దు అంటే మళ్ళీ కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు జనం అన్నారు. మళ్లీ వాళ్లను ఎందుకు తీసుకురావాలి? అందరూ ఒకటే అన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే.. ప్రజాశాంతి పార్టీని గెలిపించాలన్నారు. లేదంటే ప్రజలే నష్టపోతారు. 60% ప్రజలు ఉన్న బీసీలకు నేనున్నాను. నాతో క్రిస్టియన్ మైనారిటీలు ఎలాగూ ఉన్నారని తెలిపారు. 72 గంటల్లో రాజీనామా చేయకపోతే.. కొండా సురేఖ పై కేసు దాఖలు చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఏఏ సెక్షన్ల ప్రకారమైతే తన పదవిని పోగొట్టుకున్నారో వాటిని మించి కొండా సురేఖపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. కొండా సురేఖ రాజీనామా చేసినా.. లేదా ఆమెను పదవి నుంచి తొలగించినా… నాకు ఒక కేసు మిగులుతుందన్నారు. హైడ్రా విషయంలో వ్యతిరేకత పెరుగుతుందని, ప్రజల దృష్టి మళ్లించేందుకు కొండా సురేఖతో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయించారేమో అన్నారు.
TPCC Chief Mahesh Goud: ఇక చాలు ఆపండి.. సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి..