Site icon NTV Telugu

KA Paul: నన్ను చంపితే స్వర్గానికి పోతా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Ka Paul

Ka Paul

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని చంపాలని చూస్తున్నారని అన్నారు. తనని (కేఏ పాల్) చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని పాల్ అన్నారు. తనను (కేఏ పాల్) చంపాలని అనుకున్న వారే చచ్చి పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటానని పాల్ అన్నారు. కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టే లు తీసుకువస్తున్నా అన్నారు. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయని అని తెలిపారు. మోడీ, చంద్రబాబు, పవన్.. కాంగ్రెస్ లు నాకు శత్రువులు అన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళన పై ఆయన స్పందిస్తూ.. వేలాది మంది గ్రూప్ వన్ అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరం అన్నారు. అభ్యర్థులను గాయపరచడం సరైందా అన్నారు. పరిపాలన చాత కాకపోతే సిఎం రేవంత్ రెడ్డి రాజీనామా చెయ్యండి అన్నారు. వేలమందినీ ఎందుకు కొడుతున్నారు? అని ప్రశ్నించారు. ఇల్లీగల్ అర్దర్స్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారని అన్నారు. పోలీసులు పిచ్చి పిచ్చి గా వ్యవహరిస్తున్నారు.. వారిపై కేసు వేయాల్సి వస్తోందన్నారు. రేవంత్ రెడ్డి మారాలి.. రైతులు ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా చేస్తున్నారని మండిపడ్డారు.
Ap-Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

Exit mobile version