Polling Delay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌లో అంతరాయం ఏర్పడింది. షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 30లో సాంకేతిక సమస్య కారణంగా ఓటింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ బూత్‌లో ఈవీఎంలో తలెత్తిన సమస్య వల్ల పోలింగ్ ప్రారంభం ఆలస్యమైవుతుంది. అయితే, పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో పోలింగ్ అధికారులు ఆ సమస్యను చెక్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
Read Also: Shiva Sequel: నాగ చైతన్య-అఖిల్‌లో ‘శివ’ సీక్వెల్ ఎవరితో.. ఆసక్తికర సమాధానం ఇచ్చిన ఆర్జీవీ!
ఇక, పోలింగ్ మొదలవుతుందని ఆశించిన ఓటర్లు గత 30 నిమిషాలుగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. అధికారులు వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యను పరిష్కరించి, ఓటింగ్ ప్రక్రియను సజావుగా ప్రారంభించేందుకు ట్రై చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ లో అంతరాయం కలగడంతో ఓటర్ల అసహనానికి గురైతున్నారు. అయితే, పోలింగ్ ప్రారంభం కాగానే, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా, షేక్పేట్ డివిజన్ పరిధిలో సుమారు 70,545 మంది ఓటర్లు తమ ఓటు హక్కుకు వినియోగించుకోనున్నారు.
