Site icon NTV Telugu

Komatireddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో మాటల మంటలు.. జగదీష్ రెడ్డి వర్సెస్‌ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి

Jagasedeesh Reddy

Jagasedeesh Reddy

Komatireddy Vs Jagadish Reddy: ఇవాళ ఐదోరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. పదేళ్ల విద్యుత్ శాఖపై సోమవారం అసెంబ్లీలో వాడి వేడి చర్చ కొనసాగుతుంది. ఇందో భాగంగా.. జగదీష్ రెడ్డి వర్సెస్‌ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి గా సభ కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జగదీష్ రెడ్డికి నల్గొండలో నేర చరిత్ర ఉందన్నారు. ఓ హత్య కేసులో 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఓ హత్య కేసులో 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరిగానని వ్యాఖ్యానించారు. నిరూపించకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేల లేదని తేలితే.. సీఎం రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేయాలని, రాజకీయాలు వదులుకోవాలని కోరారు. తనపై వచ్చిన ఆరోపణలపై సవాల్‌ చేసేందుకు సిద్ధమన్నారు. ఛైర్మన్ మీద నమ్మకం లేనప్పుడు.. కోర్టుకు పోవడం తప్పా అని ప్రశ్నించారు.

Read also: CM Revanth Reddy: తెలంగాణకు వాళ్ళేదో కరెంట్‌ తెచ్చినట్టు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

మూడు కేసుల్లోనూ కోర్టులు విచారణ జరిపి నిర్దోషిగా విడుదల చేశాయని బదులిచ్చారు. నేర చరిత్ర చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన సవాల్ విసిరారు. కేసీఆర్ నిజంగా సత్య హరిశ్చంద్రుడని, సంచులు మోసే చంద్రుడు కాదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జగదీశ్ రెడ్డి పరోక్షంగా ప్రస్తావించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని జగదీశ్ రెడ్డి స్పీకర్‌ను కోరారు. డమ్మీ మంత్రి అంటున్నారు నన్ను అని మండిపడ్డారు. డమ్మీ మంత్రినే 20 వేల కోట్లు సంపాదిస్తే.. ఒరిజినల్ మంత్రి ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు అన్నారు. కమిషన్ ఛైర్మన్ ఎలా ఉండాలి? అని ప్రశ్నించారు. ఆయన భూ కబ్జా దారుడు అని రేవంత్.. వీహెచ్ అన్నారు. జగదీష్ రెడ్డి పై వున్న కేసులు నిరూపిస్తా.. లేదంటే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని జగదీష్ రెడ్డి చేసిన సవాల్ ను కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్వీకరించారు.సభ వాయిదా వెయ్యండి..నల్గొండ ఎస్పీ నుండి వివరాలు తెప్పించండని అన్నారు. దీంతో అసెంబ్లీలో మాటల వార్ కొనసాగింది.
Raj Gopal Reddy: యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలోచన ఆయనదే..

Exit mobile version