Site icon NTV Telugu

ITC Kohinoor Pub : పబ్‌లో రాత్రి ఏం జరిగిందో బయటపెట్టిన విష్ణు..

Itc Pub Case

Itc Pub Case

ఐటీసీ కోహినూర్ పబ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. రాయదుర్గం పీఎస్‌కు బాధిత యువతి, విష్ణు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమపై ఓ గ్యాంగ్ దాడికి పాల్పడిందని విష్ణు పేర్కొంది. నేను ఇద్దరం స్నేహితులం కలిసి బార్ అండ్ పబ్ కు వెళ్ళామని, అక్కడ మాతో పాటు ఉన్న అమ్మాయి మ్యూచ్‌వల్ ఫ్రెండ్ తన స్నేహితులతో వచ్చారని తెలిపింది. కొద్దిసేపటి తరువాత అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారని, అడ్డుకునేందుకు నేను నా ఫ్రెండ్ ప్రయత్నించామని విష్ణు తెలిపింది. కానీ అవతలి వ్యక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అమ్మాయిని రేప్ చేస్తామని బెదిరించారని, నాపై బీర్ బాటిల్ తో దాడి చేసి నా తల పగులగొట్టారని విష్ణు తెలిపింది.

దాదాపుగా ఎనిమిది మంది ఉన్నారని, మా పై దాడి చేసిన వారు పలుకుబడి కలిగిన వాళ్ళ పిల్లలుగా ఉన్నారని పేర్కొంది. గాయాలు కావడంతో ఆస్పత్రికి వెళ్ళామని, బార్ అండ్ పబ్ సిబ్బంది రిక్వెస్ట్ చేయడంతో ముందు ఫిర్యాదు చేయలేకపోయామన్నారు. బార్ లో ఉన్న సీసీ కెమెరాల్లో అన్ని రికార్డయ్యాయని విష్ణు తెలిపింది.

 

Exit mobile version