NTV Telugu Site icon

IT Rides: హైదరాబాద్‌ లో మరోసారి ఐటీ దాడులు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు

It Raids

It Raids

IT Rides: హైదరాబాద్‌ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఇవాళ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంపెనీ మేనేజర్లు కల్పనా రాజేంద్ర, లక్ష్మణ్‌ల ఇళ్లతో పాటు షాద్‌నగర్‌, చేవెళ్ల, బంజారాహిల్స్‌లోని కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల స్వస్తిక్ గ్రూప్ షాద్ నగర్ ప్రాంతంలో ఓ ఎంఎన్ సీ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని విక్రయించింది. అయితే భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన లెక్కలు బ్యాలెన్స్ షీట్ లో చూపలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
Hyderabad: చార్మినార్ వద్ద గంజాయి బ్యాచ్ హల్ చల్.. నడిరోడ్డు పై కట్టెలతో దాడి..

Show comments