Site icon NTV Telugu

Hyderabad: నేష‌న‌ల్ పోలీసు అకాడ‌మీలో 76వ ఐపీఎస్ ప్రొబేష‌న‌ర్ల అవుట్ ప‌రేడ్..

Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్ నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ ఐపీఎస్ ప్రొబేషనర్ల ఔట్ పరేడ్ జరిగింది. 2023 బ్యాచ్‌కు చెందిన 188 మంది ట్రైనీ ఐపీఎస్‌లు తమ శిక్షణను పూర్తి చేశారు. వీరిలో 56 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. 76వ RR (రెగ్యులర్ రిక్రూట్) IPS బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు కేంద్ర హోం మంత్రి నిత్యానంద రాయ్ హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న 188 మందిలో 109 మంది ఇంజినీరింగ్, 15 మంది ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అలాగే న్యాయశాస్త్రంలో నలుగురు, ఆర్ట్స్‌లో 28 మంది, సైన్స్‌లో 22 మంది, వాణిజ్యంలో ఎనిమిది మంది, ఇతర డిగ్రీల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అలాగే 188 మంది ట్రైనీ ఐపీఎస్‌లకు యువత ఎక్కువ. 25 ఏళ్లలోపు వారు 15 మంది, 25-28 ఏళ్లలోపు వారు 102 మంది ఉన్నారు. మహిళా ఐపీఎస్‌ అధికారులు 54 మంది ఉండగా అందులో 38 మంది అవివాహితులే. అలాగే, 134 మంది పురుషులలో 116 మంది అవివాహితులే. కాగా, 76వ ఆర్‌ఆర్ (రెగ్యులర్ రిక్రూట్) ఐపీఎస్ బ్యాచ్‌లో 188 మంది భారతీయులు, 19 మంది విదేశీయులు ఫేజ్-1 బేసిక్ కోర్సులో మొత్తం 207 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ తెలిపారు. 19 మంది విదేశీయుల్లో నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన వారున్నారు.
Chain-Snatchers: రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్.. ఖమ్మంలో మూడు చోట్ల చోరీ..

Exit mobile version