NTV Telugu Site icon

Hostels Checking: నేడు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో తనిఖీలు.. ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే..

Hostel Cheking

Hostel Cheking

Hostels Checking: నేడు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి లతో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను సందర్శించినన్నారు. అక్కడే విద్యార్ధులతో కలసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేయనున్నారు.

రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టల్ల పనితీరును నిరంతరం పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది.

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటి హాస్టల్లో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించడంతోపాటు మెరుగైన విద్య బోధనా అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించి పరిస్థితులను స్వయంగా సమీక్షించనుంది.

సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రుల పర్యటన వివరాలు ఇవే..

* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల లోని పలు సంక్షేమ హాస్టల్ లో ఆకస్మిక తనిఖీలు.
* ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లాలోని MJPBCWR JC (బాలికలు) మధిర పాఠశాల,బోనకల్ లో తనిఖీలు
* మంత్రి దామోదర రాజనరసింహ, భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC(బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్ లో తనిఖీలు
* మంత్రి శ్రీధర్ బాబు, భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC(బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్ లో తనిఖీలు
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లాలోని TGTWR JC (బాలికలు), మాదిరిపురం, తిరుమలాయపాలెంలో తనీఖీలు
* మంత్రి పొన్నం ప్రభాకర్, TGSWR JC(బాలుర), షేక్‌పేట, హైదరాబాద్ లో తనిఖీలు
* మంత్రి కొండా సురేఖ, TGSWR JC(బాలురు), హతనూర, సంగారెడ్డిలో తనిఖీలు
* మంత్రి అనసూయ సీతక్క, ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), నేరడిగొండ, ఆదిలాబాద్ లో తనిఖీలు
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏకలవ్య మోడల్ RI, TWD,గండుగులపల్లి, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడం తనిఖీలు
* మంత్రి జూపల్లి కృష్ణారావు, TGSWR JC(బాలికలు), కొల్లాపూర్, నాగర్ కర్నూలలో తనిఖీలు నిర్వహించనున్నారు

Show comments