Hostels Checking: నేడు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో తనిఖీలు.. ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే..
- నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో తనిఖీలు
- సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాస్టళ్లలో సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hostels Checking: నేడు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి లతో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను సందర్శించినన్నారు. అక్కడే విద్యార్ధులతో కలసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేయనున్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టల్ల పనితీరును నిరంతరం పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటి హాస్టల్లో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించడంతోపాటు మెరుగైన విద్య బోధనా అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించి పరిస్థితులను స్వయంగా సమీక్షించనుంది.
సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రుల పర్యటన వివరాలు ఇవే..
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల లోని పలు సంక్షేమ హాస్టల్ లో ఆకస్మిక తనిఖీలు.
* ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లాలోని MJPBCWR JC (బాలికలు) మధిర పాఠశాల,బోనకల్ లో తనిఖీలు
* మంత్రి దామోదర రాజనరసింహ, భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC(బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్ లో తనిఖీలు
* మంత్రి శ్రీధర్ బాబు, భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC(బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్ లో తనిఖీలు
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లాలోని TGTWR JC (బాలికలు), మాదిరిపురం, తిరుమలాయపాలెంలో తనీఖీలు
* మంత్రి పొన్నం ప్రభాకర్, TGSWR JC(బాలుర), షేక్‌పేట, హైదరాబాద్ లో తనిఖీలు
* మంత్రి కొండా సురేఖ, TGSWR JC(బాలురు), హతనూర, సంగారెడ్డిలో తనిఖీలు
* మంత్రి అనసూయ సీతక్క, ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), నేరడిగొండ, ఆదిలాబాద్ లో తనిఖీలు
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏకలవ్య మోడల్ RI, TWD,గండుగులపల్లి, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడం తనిఖీలు
* మంత్రి జూపల్లి కృష్ణారావు, TGSWR JC(బాలికలు), కొల్లాపూర్, నాగర్ కర్నూలలో తనిఖీలు నిర్వహించనున్నారు
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!