NTV Telugu Site icon

Secunderabad: ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఏడు క్వింటాళ్ల కుళ్ళిపోయిన కోడి మాంసం స్వాధీనం

Secunderabad

Secunderabad

Secunderabad: సికింద్రాబాద్ లో చికెన్ సెంటర్ లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. బాలయ్య చికెన్ సెంటర్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్ళిపోయిన కోడి మాంసంతో పాటు కొవ్వు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన కోడి మాంసాన్ని కెమికల్స్ వేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని జనతా బార్ లకు కుళ్ళిన కోడి మాంసాన్ని బాలయ్య చికెన్ సెంటర్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడు క్వింటాళ్ల కుళ్ళిపోయిన కోడి మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాలయ్య చికెన్ సెంటర్ ని సీజ్ చేశారు. నగరంలోని జనతా బార్ లకు చికెన్ ను సరఫరాపై ఆరా తీస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. బాలయ్య చికెన్ సెంటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బాలయ్య చికెన్ సెంటర్ ని సీజ్ చేశామని అధికారుల వెల్లడించారు. ప్రజలు రెస్టారెంట్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
K. A. Paul: నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి..