Site icon NTV Telugu

Infosys: హైదరాబాద్లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ.. కొత్తగా 17 వేల ఉద్యోగాలు!

Infosis

Infosis

Infosys: ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో తమ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించడనికి ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్వో జయేష్ సంగ్రాజ్కా మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. అనంతరం ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఇన్ఫోసిస్ సంస్థ రూ. 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడుతుంది.. వచ్చే రెండు మూడేళ్లలో ఈ నిర్మాణం పూర్తైతుంది.. ఈ కొత్త సెంటర్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ పర్యావరణ వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుంది. దేశంలో ప్రముఖ ఐటీ గమ్యస్థానంగా తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచుతుంది.

Read Also: Venkatesh : దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలపై స్పందించిన వెంకటేశ్

ఇక, ఇప్పటికే హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్ కంపెనీలో దాదాపు 35 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకోవడంతో కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని.. ఇప్పుడున్న ఐటీ సమూహాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉమ్మడి దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని జయేష్ సంఘ్రాజ్క అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే లక్ష్యంతో అన్ని రంగాల్లో ప్రముఖ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలకు ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Exit mobile version