NTV Telugu Site icon

Nagarjuna Sagar: నిండుకుండలా నాగార్జున సాగర్‌..

Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjuna Sagar: గత వారం రోజులుగా శ్రీశైలం జలాశయానికి భారీ వరదలు వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం పూర్తి స్థాయికి చేరుకోనుంది. రేపు సాయంత్రానికి సాగర్‌ నిండుతుందని అధికారులు చెబుతున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 573 అడుగులకు చేరుకుంది. అలాగే సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 264 టీఎంసీలు దాటింది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో రేపు సాయంత్రానికి డ్యాం నిండనుంది. దీంతో రేపు ఎల్లుండి సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై డ్యాం అధికారులు ప్రకటన చేయాల్సి ఉండగా.. ఇప్పటికే సాగర్ నిండిపోవడంతో ఆయకట్టు రైతులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

Read also: Dhanush: మొత్తానికి ఊపిరి పీల్చుకున్న ‘రాయన్’ బయ్యర్స్.. కలెక్షన్స్ ఎంతంటే..?

డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 240.83 టీఎంసీలుగా ఉంది. సాగర్ కుడి కాలువకు 6,324 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1418 క్యూసెక్కులు, ఎల్‌ఎల్‌బీసీ (ఏఆర్‌ఎంపీ)కి మరో 1800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాల ప్రియ దర్శని డ్యాంకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి 2.90 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం జలాశయం నుంచి 2,66,192 వరద దిగువకు వదులుతున్నారు. స్పిల్‌వే నుంచి 2,45,750 క్యూసెక్కులు, పవర్‌హౌస్‌ నుంచి 17,782 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 7.991 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 4.284 టీఎంసీలుగా ఉంది.
Madhyapradesh : పెను ప్రమాదం.. ఆడుకుంటున్న చిన్నారులపై గోడ పడి 9 మంది మృతి