Nagarjuna Sagar: నిండుకుండలా నాగార్జున సాగర్..
- గత వారం రోజులుగా శ్రీశైలం జలాశయానికి భారీ వరదలు..
- 10 గేట్లను ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల..
- రేపు ఎల్లుండి సాగర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar: గత వారం రోజులుగా శ్రీశైలం జలాశయానికి భారీ వరదలు వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం పూర్తి స్థాయికి చేరుకోనుంది. రేపు సాయంత్రానికి సాగర్ నిండుతుందని అధికారులు చెబుతున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 573 అడుగులకు చేరుకుంది. అలాగే సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 264 టీఎంసీలు దాటింది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో రేపు సాయంత్రానికి డ్యాం నిండనుంది. దీంతో రేపు ఎల్లుండి సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై డ్యాం అధికారులు ప్రకటన చేయాల్సి ఉండగా.. ఇప్పటికే సాగర్ నిండిపోవడంతో ఆయకట్టు రైతులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
Read also: Dhanush: మొత్తానికి ఊపిరి పీల్చుకున్న ‘రాయన్’ బయ్యర్స్.. కలెక్షన్స్ ఎంతంటే..?
Also Read
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 240.83 టీఎంసీలుగా ఉంది. సాగర్ కుడి కాలువకు 6,324 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1418 క్యూసెక్కులు, ఎల్‌ఎల్‌బీసీ (ఏఆర్‌ఎంపీ)కి మరో 1800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాల ప్రియ దర్శని డ్యాంకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి 2.90 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం జలాశయం నుంచి 2,66,192 వరద దిగువకు వదులుతున్నారు. స్పిల్‌వే నుంచి 2,45,750 క్యూసెక్కులు, పవర్‌హౌస్ నుంచి 17,782 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 7.991 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 4.284 టీఎంసీలుగా ఉంది.
Madhyapradesh : పెను ప్రమాదం.. ఆడుకుంటున్న చిన్నారులపై గోడ పడి 9 మంది మృతి
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..