Site icon NTV Telugu

Water Mafia: సున్నం చెరువు చుట్టూ నీటి దందా..

Sunnam Cheruvu

Sunnam Cheruvu

Water Mafia: హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సున్నం చెరువు చుట్టూ గుట్టుచప్పుడు కాకుండా నీటి దందా కొనసాగుతుంది. చెరువు చుట్టు ఎక్కడపడితే అక్కడ బోర్లు వేసి ఆ నీళ్లను పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. బోరబండ, మాదాపూర్, గోపన్ పల్లి.. ఇలా అనేక చోట్లకి ఈ నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే, మాదాపూర్ లోని అనేక కార్పొరేట్ హాస్టల్స్ కి ఈ నీటిని పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజూ రాత్రిపూట పెద్ద పెద్ద ట్యాంకర్లలో ఈ నీటిని సరఫరా చేస్తున్నారు. సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కాలుష్యం ఏర్పడింది.

Read Also: Ileana D’Cruz: రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. పిక్ వైరల్!

అయితే, ఈ నీటిలో సీసం, కార్డియం లాంటి లోహాల మోతాదుకి మించి ఉన్నట్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుర్తించింది. ఇప్పటికే సున్నం చెరువులోని నీటిని తొలగించి పూడిక పనులు చేస్తున్నారు అధికారులు. చాలా స్పీడ్ గా పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. దీంతో సున్నం చెరువు చుట్టూ అనేక వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి.

Exit mobile version