Hyderabad Police: రాంగ్ రూట్ లో వాహనం నడిపితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పైగా.. యాక్సిడెంట్లు చేస్తే.. జైలు శిక్ష కూడా పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ట్రై కమిషనరేట్ల పరిధిలో రోజుకు 10 నుంచి 20 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ కనీసం ఒకరిద్దరు మరణిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్‌తో పాటు ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. గత ఏడాది రాంగ్ వే డ్రైవింగ్ కారణంగా 8 మంది చనిపోగా, 150 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఒకరు మృతి చెందగా, 128 మంది గాయపడ్డారు. బుధవారం నిర్వహించిన ఒకరోజు స్పెషల్ డ్రైవ్‌లో 688 మంది వాహనదారులు తప్పు దిశలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడగా, వారిలో 659 మంది ద్విచక్రవాహనదారులు ఉన్నారు. మిగిలిన వాటిలో 21 మూడు చక్రాల వాహనాలు, 8 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు రాంగ్ వే డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయి.
Read also: IIIT Student Suicide: ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
రాంగ్ డ్రైవింగ్ నిబంధనలను ఉల్లంఘించే వారికే కాకుండా ఇతర వాహనదారులకు కూడా ప్రమాదకరం మని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించినా.. వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. కొత్త చట్టాల ప్రకారం తప్పుగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. కమిషనరేట్ పరిధిలోని 124 ప్రాంతాల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాహనదారులను గుర్తించేందుకు ప్రత్యేక ఏఎన్ పీఆర్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కెమెరాల ద్వారా అక్రమార్కులను గుర్తించి వాహనదారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మోటారు వాహన చట్టంలోని 119/177, 184 సెక్షన్‌ల ప్రకారం రాంగ్‌సైడ్ డ్రైవింగ్ నేరం. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 125, 281 ప్రకారం వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాం. అలాగే ప్రమాదాలకు కారణమైతే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కేసు తీవ్రతను బట్టి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. అందుకే రాంగ్ రూట్ లో వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు.
Telangana: ఐదుగురు సీనియర్ ఐపీఎస్ లకు డీజీ హోదా..