NTV Telugu Site icon

Hydra: అమీన్ పూర్, కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు..

Hydra

Hydra

Hydra: హైదరాబాద్‌లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గత కొద్ది రోజులుగా కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా మళ్లీ ఆక్రమిత నిర్మాణాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో అమీన్‌పూర్‌, కూకట్‌పల్లిలో కూల్చివేతలకు మొదలు పెట్టింది. తెల్లవారుజామునే ప్రొక్లెయినర్లతో చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

కూకట్‌పల్లిలోని నల్లచెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నివాసం ఉన్న భవనాలు మినహా నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. మెుత్తం విసీర్ణం 27 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. బఫర్ జోన్‌లో 25 అపార్ట్‌మెంట్లు, ఒక భవనాన్ని నిర్మించారు. ఇప్పటికే ఆక్రమణదారులకు హైడ్రామా అధికారులు నోటీసులు జారీ చేశారు. మొత్తం 16 నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట 12వ సర్వే నంబర్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేస్తున్నారు. పటేల్ గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వేనెంబర్ 6 పేరుతో, కిష్టారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నంబర్ లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలుగా గుర్తించింది. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ నిర్మాణాలు ఓ ప్రముఖ బిఆర్ఎస్ నేత నిర్మించారని గుర్తించారు. అయితే కూల్చివేత వద్ద అధికారులు మీడియాను అనుమతించకపోవడం గమనార్హం.
High Court : దేశంలోని ఎనిమిది హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు.. నోటిఫికేషన్ జారీ