NTV Telugu Site icon

Rain Alert: హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్.. ఏడు జిల్లాల్లో భారీ వర్ష సూచన..

Rain Alert

Rain Alert

Rain Alert: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నుంచి పలుచోట్ల వర్షం కురిసింది. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తాజా హెచ్చరికల ప్రకారం మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, మెదక్ కుమురంభీం, హైదరాబాద్ ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. అలాగే కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం చోర్పల్లిలో పిడుగుపాటుకు అంజన్న యువకుడు మృతి చెందాడు.

Read also: Rajanna Sircilla: మరో యువతితో భార్యకు రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన ఎమ్మెల్యే అనుచరుడు

ఏపీ విషయానికొస్తే.. తెలికపాటి నుంచి పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ తెలిపింది. శనివారం (ఆగస్టు 17) అల్లలూరి, కృష్ణా, ఏలూరు, మన్యం, గుంటూరు, ఎన్టీఆర్, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నంద్యాల, అనంతపురం, విజయనగరం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, కోనసీమ, ఉభయగోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Paramilitary Attack: పారామిలటరీ బలగాల నరమేధం.. 80 మంది సామాన్యులు హతం