HYD RACING NEWSENSE: రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా

  • బైకులు, కార్లతో పోకిరీలు రెచ్చిపోతున్నారు
  • కేబుల్‌ బ్రిడ్జ్‌ పరిసర ప్రాంతాల్లో హంగామా
  • రేసింగ్‌ పేరుతో రచ్చ చేస్తే.. తాట తీస్తామంటున్నారు పోలీసులు
Hyd Racing Newsense

Hyd Racing Newsense

రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చారు..!! పోలీసులనే భయం కూడా లేకుండా రచ్చ చేస్తున్నారు. వీకెండ్‌ వస్తే చాలు పోకిరీలు సృష్టించే హంగామా పరాకాకష్టకు చేరింది. రేసింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల మీదకే దూసుకురావడంతో… పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. యువకులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. రేసింగ్‌ పేరుతో రచ్చ చేస్తే.. తాట తీస్తామంటున్నారు పోలీసులు.

వీకెండ్‌ వస్తే చాలు… కేబుల్‌ బ్రిడ్జ్‌ పరిసర ప్రాంతాల్లో హంగామా అంతాఇంతా కాదు. బైకులు, కార్లతో పోకిరీలు రెచ్చిపోతున్నారు. రేసింగ్‌లు.. స్టంట్‌లు.. విన్యాసాలతో హడలెత్తిస్తున్నారు. ఈ హంగామాను చూసేందుకు వందలాదిగా యువకులు గుమిగూడి… కేకలు, కేరింతలతో న్యూసెన్స్‌ సృష్టిస్తున్నారు. రేసింగ్‌ రచ్చను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల మీదకే వెహికిల్స్‌తో దూసుకొచ్చారు. సహనం కోల్పోయిన పోలీసులు… లాఠీలకు పనిచెప్పారు..

చూస్తున్నారుగా… పోలీసులు ఇలా కారు అద్దాలు పగలగొట్టే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత చేయిదాటిపోయిందో అర్థమవుతుంది. వీకండ్‌ వస్తే చాలు.. పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారారు పోకిరీలు. రేసింగ్‌‌లతో న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తూ… వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. నీలోఫర్‌ సమీపంలో రాత్రివేళల్లో కొందరు ఆకతాయిలు బైకులు, కార్లతో రేసింగ్‌లు, స్టంట్‌లకు పాల్పడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి వెళ్లి.. ఆకతాయిలను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. రెచ్చిపోయిన పోకిరీలు ఏకంగా పోలీసుల మీదకు కార్లతో దూసుకొచ్చారు. దీంతో పోలీసులు.. కారు అద్దాలు పగలగొట్టి మరీ ఆకతాయిలను పట్టుకున్నారు.

హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్ టీ-హబ్, ఐటీసీ కోహినూర్, సత్వ బిల్డింగ్, మై హోం భుజ సమీపంలోని రోడ్లలో బైక్‌, కార్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. అటుగా వచ్చే వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పూర్తిగా రెండు వైపులా రోడ్డు ను బ్లాక్‌ చేసి స్టంట్‌లు చేస్తున్నారు. సిటీలోని పలు ప్రాంతాల నుంచి యువకులు కార్లు, బైకుల్లో వచ్చి ఇక్కడ విన్యాసాలు చేస్తున్నారు. పోటీలు, పందాలు కూడా పెట్టుకుంటున్నారు.

వాయిస్‌: వాహనదారులు, స్థానికంగా ఉండే వాళ్లు.. ఈ పోకిరీల విన్యాసాలు భరించలేక పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో… నిఘాపెట్టిన పోలీసులు… సీసీ కెమెరాల ద్వారా ఆకతాయులు చేస్తున్న విన్యాసాలను గమనించారు. పలు వీడియోలు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవడంతో… పోలీసులు సీరియస్‌గా తీసుకుని.. ప్రతీ వీకెండ్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఐనా… పోకిరీలు మాత్రం అడ్డాలు మార్చి రేసింగ్‌‌లు పెట్టుకుంటున్నారు.

హుస్సేన్‌ సాగర్‌ పరిసరాల్లో… ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్‌లో బైక్ రైసింగ్‌లకు పాల్పడుతున్న పోకిరీలు ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి కేబుల్‌ బ్రిడ్జ్‌ ప్రాంతాలను అడ్డాగా మార్చుకున్నారు. బైక్‌లు, కార్ల స్టంట్‌లను చూసేందుకు వందలాది మంది యువకులు కూడా అక్కడ గుమిగూడుతున్నారు. కేకలు వేస్తూ… గట్టిగా అరుస్తూ న్యూసెన్స్‌కు పాల్పడతున్నారు.

కొన్ని నెలల క్రితం స్టంట్‌లకు పాల్పడతున్న సమయంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు… ఆకతాయిల ఆటకట్టించారు. 50కి పైగా బైకులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులు గ్యాప్‌ ఇచ్చిన ఆకతాయిలు మళ్లీ రెచ్చిపోయారు. దీపావళి సందర్భంగా టపాకాయలు కాలుస్తూ.. ఆటోలు, బైకులు, కార్లతో స్టంట్‌లో నిర్వహిరు. రేసింగ్‌ నిర్వహిస్తుండగానే పోలీసులు అక్కడికి చేరుకోగానే.. క్షణాల్లో పారిపోయారు యువకులు.

మరోవైపు ఔటర్ రింగ్‌రోడ్‌పై 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి టోల్ గేట్ నుంచి టీజీపీఏ టోల్ గేట్ వైపు మే 10న ఉదయం సుమారు 10:30 గంటలకు వాహన తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ ‘TGTR2026’ కలిగిన వోక్స్‌వ్యాగన్ కారును ఓ వ్యక్తి అత్యంత వేగంగా.. నిర్లక్ష్యంగా నడిపినట్ల సాయిరామ్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను మొబైల్‌లో చిత్రీకరించి ‘యశ్వంత్ రెడ్డి’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. సాయిరామ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు యశ్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో నిందితుడిని యశ్వంత్ రెడ్డిని ప్రైవేట్ ఉద్యోగిగా గుర్తించారు.

ఏప్రిల్-2026లో వోక్స్‌వ్యాగన్ కారును కొనుగోలు చేసిన యశ్వంత్.. వాహనం పనితీరును పరీక్షించేందుకు ORR పై సుమారు 200 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసులు అతడు వాడిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్, ప్రమాదకర స్టంట్లు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ తరహా చర్యలు అమాయక ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించి ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.