CV Anand: పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిదని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 747 మంది పోలీసు కానిస్టేబుళ్ల పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్ లో సీవీ ఆనంద్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందులో నుండి హైదరాబాద్ పోలీస్ శాఖకు 1,128 మందిని ట్రైనింగ్ కోసం కేటాయించామన్నారు. ఇప్పుడు 747 మంది దీక్షత్ పాసింగ్ అవుట్ పరేడ్ చేశారని తెలిపారు. 3,081 మంది మహిళల కానిస్టేబుల్స్ పోలీస్ శిక్షణ పొందారన్నారు.
Read also: Telangana Olympic: నేడు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు..
1992లో నేను ఐపీఎస్ శిక్షణ పొందానూ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగిందన్నారు. అప్పుడు 80మంది ట్రైనీ ఐపిఎస్ లు పాల్గొన్నామన్నారు. వర్షం పడుతున్న పరేడ్ పూర్తి చేసామన్నారు. శిక్షణ పొంది పోలీస్ శాఖలో 35 ఏళ్లు గడపబోతున్నారని తెలిపారు. శిక్షణ పొందిన వారు అకుంటిత దీక్షతో పని చేయాలన్నారు. పోలీసులు రాజ్యాంగానికి విధేయత చూపాలన్నారు. పోలీసులు నిజాయితీగా, న్యాయంగా పనిచేయాలన్నారు. ప్రజల మాన ప్రాణాలు కాపాడడంలో కర్తవ్యం నెరవేర్చాలని తెలిపారు. పోలీస్ డ్యూటీ అంటే ఒడిదుడుకులతో కుదుకుందరి అన్నారు. పోలీసులు తాగుడుకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని సూచించారు. యువ పోలీసులు ఫిజికల్ ఫిట్ నెస్ గా ఉండాలన్నారు. దేనికి ఏ వ్యసనానికి కూడా లొంగకూడదు బానిస కాకూడదని తెలిపారు. నా 33 ఏళ్ల పోలీస్ సర్వీస్ లో 75 కేజీల మధ్యలో ఉన్నానని తెలిపారు.
Read also: Keesara Accident: కాపాడమని వేడుకున్న కనికరించలేదు.. బాధితుడు ఆసుపత్రికి చేరేలోపే..
నేను చాలా ఫిట్ గా ఉన్నానని, 30 ఏళ్ల క్రితం నా ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ లో వేసుకున్న పోలీస్ డ్రెస్ ఇప్పుడు కూడా వేసుకోగలనని అన్నారు. మీరు శిక్షణ పొందిన పెట్ల బురుజు ఆర్మ్ రిజర్వ్ ఇన్చార్జ్ డీసీపీ దక్షిణామూర్తిని చూడండి ఎంత ఫిట్ గా ఉన్నారో అని తెలిపారు. ఫిట్ గా ఉన్న వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పోలీసుల జీతాల విషయంలో ప్రభుత్వం ఎక్కువగా పెంచదు అన్నారు. పోలీసులు అవినీతికి పాల్పడకూడదన్నారు. ఐపీఎస్ లాంటి ఉద్యోగంలో కూడా జీతాలు అంతంత మాత్రమే అన్నారు. పోలీస్ శాఖలో మెల్లమెల్లగా జీతాలు పెరుగుతూనే ఉంటాయన్నారు. పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిదని తెలిపారు. ఒక పరిస్థితిలో నేను కూడా రాజీనామా చేసి వెళ్ళలనుకున్నా అని సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. శిక్షణ తీసుకున్నవారు మీ సేవల ద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
Mancherial: మంచిర్యాలలో 600 పడకల ఆసుపత్రి.. నిర్మాణ పనులకు మంత్రి దామోదర శంకుస్థాపన..