Terrorist Arrest: హైదరాబాద్‌లో అరెస్టైన ఉగ్రవాది డాక్టర్ మొయినుద్దీన్ నుంచి కీలక సమాచారం
- రాజేంద్రనగర్‌లో డాక్టర్ మొయినుద్దీన్‌ను అరెస్ట్ చేసిన గుజరాత్ ఏటీఎస్..
- భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి చంపాలని కుట్ర చేసిన మొయినుద్దీన్..
- రెసిన్ విషంను తయారు చేస్తున్న సయ్యద్ మొయినుద్దీన్..
- సయ్యద్ నుంచి రెసిన్ కు సంబంధించిన పదార్థాల స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Arrest: రాజేంద్రనగర్‌కు చెందిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. భారీ స్థాయిలో విష ప్రయోగం చేసి అమాయక ప్రజలను చంపాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. అయితే, సయ్యద్ మొయినుద్దీన్ అత్యంత ప్రమాదకరమైన ‘రెసిన్’ విషాన్ని తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. దేవాలయాలు, వాటర్ ట్యాంకులలో ఈ విషాన్ని కలిపేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాది మొయినుద్దీన్ వద్ద నుంచి రెసిన్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, పరికరాలను గుజరాత్ ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది.
Read Also: Amit Shah: కాసేపట్లో అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం
Also Read
- Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
- Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ఇక, పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద హ్యాండ్లర్ ఆదేశాల మేరకే ఉగ్రవాది మొయినుద్దీన్ ఈ రెసిన్ విషాన్ని తయారు చేస్తున్నట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ధృవీకరించారు. ఇతను నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ – ఖొరాసన్ ప్రావిన్స్’ కు చెందిన హ్యాండ్లర్ అబు ఖాదిమ్‌తో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే, డాక్టర్ మొయినుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. అనంతరం ఆన్‌లైన్ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ, ఒకవైపు టెర్రరిస్టు కార్యకలాపాల్లో భాగం అయ్యాడు. ఉగ్రవాద దాడుల కోసం నిధులు సేకరించడం, కొత్త వారిని రిక్రూట్ చేసుకునే ప్లాన్‌లో కూడా ఇతడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కుట్రకు సంబంధించి డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్‌తో పాటు మరో నలుగురిని కూడా గుజరాత్ ఏటీఎస్ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..