రక్తదానం చేస్తే ప్రాణదానం చేసిన వాళ్లం అవుతామని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్బంగా హైదరాబాద్ ప్లేట్‌బుర్జ్‌లోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని డీజీపీ శవధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రారంభించారు. నగరంలో అన్ని జోన్లలో 9 రక్త దాన శిబిరాలను సిటీ పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. 3,500 మంది దాతలతో మెగా రక్త దాన కార్యక్రమం చేపట్టారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీస్ అమర వీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rohini Kalam: విషాదం.. జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య
రాష్ట్రంలో 8 వేల మంది ఏడాదికి రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోతున్నారని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. సకాలంలో వీరంతా రక్తం అందక చనిపోతున్నారన్నారు. గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సజ్జనర్ కోవిడ్ సమయంలో గొప్ప సేవ చేశారని.. రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి పోలీసును అభినందిస్తున్నానన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడొచ్చని ప్రజలు గమనించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Rajasthan: ఓ ప్రభుత్వాధికారి ఘరానా మోసం.. ఏ జాబ్ చేయకుండానే భార్యకు రూ.37.54 లక్షల జీతం.. వెలుగులోకి ఇలా..!
తలసేమియాతో బాధ పడుతున్న రోగులకు సహాయం చేసేందుకు రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ అన్నారు. నగరంలో అన్ని జోన్లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 9 క్యాంపస్ ద్వారా 3,500 యూనిట్స్ టార్గెట్ పెట్టుకుని శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బ్లడ్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ప్రజలు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు, ఎమర్జెన్సీ సమయంలో ఆపరేషన్‌లో బ్లడ్ అవసరం ఉంటుందని తెలిపారు. బ్లడ్ యూనిట్స్ తలసేమియా వారికి అందజేస్తామని చెప్పారు.
