Hyderabad: హైదరాబాద్‌లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై భాను ప్రకాష్ తుపాకీ మిస్స్ అయ్యింది. ఈ కేసులో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో జరిగిన ఒక క్రైమ్ కేసులో భాను ప్రకాష్ బంగారం రికవరీ చేసినప్పటికీ, ఆ రికవరీని అధికారిక రికార్డుల్లో చూపించకపోవడం పోలీసుల దృష్టిలోకి వచ్చింది. ఇదే సమయంలో అతని సర్వీస్ వెపన్ కూడా కనిపించకపోవడంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మారింది.
Read Also: Mumbai: ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత.. 8 మంది స్మగ్లర్లు అరెస్ట్
జనవరిలో జరిగిన క్రైమ్ కేసులో ఎస్సై భాను ప్రకాష్ బంగారం రికవరీ చేశాడు. అయితే ఆ బంగారాన్ని స్టేషన్ రికార్డుల్లో చూపించకపోవడం పోలీసులకు అనుమానం కలిగించింది. రికవరీ బంగారంతో పాటు అతని సర్వీస్ తుపాకీ కూడా కనిపించకపోవడంతో వివాదం పెద్దదైంది. నగదు, వెపన్ డబ్బుల కోసం తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భాను ప్రకాష్ ఆర్థిక ఇబ్బందులతో ఈ పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ అధికారులు ఎస్సై భాను ప్రకాష్‌ను వివరంగా విచారిస్తున్నారు. తుపాకీ, బంగారం ఎక్కడ ఉన్నాయన్న దానిపై పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు.
