Site icon NTV Telugu

Arekapudi Gandhi: ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి సవాల్.. పోలీసులు భారీ బందోబస్తు

Aeikepudi Gandhi

Aeikepudi Gandhi

Arekapudi Gandhi: నిన్న శేరిలింగంపల్లి రణరంగంగా మారిన విషయం తెలిసిందే.. కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు, అరెస్టుల వాతావరణం నెలకొంది. దీంతో గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈనేపథ్యంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారు జామునుంచే పోలీసులు గాంధీ ఇంటికి చేరుకున్నారు.

Read also: Eye Vision: సర్వేంద్రియానం నయనం ప్రధానం.. మెరుగైన కంటి చూపు కోసం ఇవి తినాల్సిందే..

ముందస్తు చర్యలో భాగంగా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలందరూ తరలిరావాలంటూ కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పడంతో వెళ్తున్నామని తెలిపారు. టిఫెన్… అక్కడే భోజనం చేస్తాం.. అక్కడి నుంచి గాంధీని తెలంగాణ భవన్, కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్తాం’’ అని వివరించారు. గురువారం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద గాంధీ రావడంతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
Malaysia Islamic Welfare Home: పిల్లలపై లైంగిక దోపిడీ.. ఇస్లామిక్ వెల్ఫేర్ హోమ్‌పై దాడి.. 171 మంది అరెస్టు

Exit mobile version