NTV Telugu Site icon

Weather Report: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు

Telangana Ellow Alert

Telangana Ellow Alert

Weather Report: దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రానికి ఐఎండీ ఐదు రోజుల పాటు వర్ష సూచన వెల్లడించింది. దీంతో నేడు తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. ఈ నెల 25వ తేది వరకు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడతాయని పేర్కొంది. మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. సాయంత్రం సమయాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ వున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Read also: Mallu Bhatti Vikramarka: ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతాం..

నిన్న ఆదివారం హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సెరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బాలానగర్‌, నిజాంపేట ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, ఉప్పల్, మలక్ పేట, మెహదీపట్నంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా రాత్రి భారీ వర్షం కురిసింది. రోడ్లు నదులను తలిపించాయి. మోకాళ్ల లోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రాంనగర్‌లో కురుస్తున్న వర్షాలకు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఓ కారు వరదలో చిక్కుకుంది. కారులో ఇరుక్కున్న నలుగురు ప్రయాణికులను స్థానికులు అద్దాలు పగులగొట్టి రక్షించారు. యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్‌ పక్కనే ఉన్న గల్లీలో ఓ కారు వరదలో కొట్టుకుపోయింది.
Patancheru Congress: గూడెం మహిపాల్ రెడ్డి పార్టీలోకి వద్దు.. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన..