NTV Telugu Site icon

Heavy Rain Alert: నేడు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ నెల 8 వరకు భారీ వర్షాలు

Heavy Rain Alert

Heavy Rain Alert

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలు వర్షబీభత్సం తేరుకోకముందే మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు (గురువారం) వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో వనగండం ఇంకా సమసిపోలేదని తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షం భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు.

Read also: V.C. Sajjanar: ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు డిసౌంట్‌ ఆఫర్‌..

కాగా, బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం పెద్దగా కురవలేదు. కానీ, రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. రాత్రి ఒక్కసారిగా వాతావరణం ఊహించని విధంగా మారి కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రోడ్లపై నీరు నిలిచిన చోట మ్యాన్ హోల్స్ తెరిచే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది తప్ప ఇంకెవ్వరూ మ్యాన్‌హోల్స్‌ తెరవకూడదని, ఇది చట్టరీత్యా నేరమని పేర్కొంది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తాకకూడదని, ముఖ్యంగా చిన్న పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని చెప్పారు. పొంగిపొర్లుతున్న రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లకూడదని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని హెచ్చరింది.
CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు..

Show comments