Telangana Rains: ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. ఎగువ వాయుగుండం కొనసాగుతుంది. ఈ ప్రభావం కారణంగా, దిగువ ట్రోపో వాతావరణంలో గాలులు వీస్తాయి. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని గంటకు 30 నుంచి 40 కి.మీ. గాలులు వేగంగా వీస్తాయని తెలిపింది. గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో గంటకు 8-10 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. మరో మూడు, నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై, ఎప్పుడైనా వర్షం కురుసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కాగా.. ఆదివారం రాత్రి 9గంటల వరకు ఉప్పల్ బండ్లగూడలో అత్యధికంగా 2.15సెం.మీలు, లింగోజిగూడలో 1.78, నాగోల్‌లో 1.75 , వనస్థలిపురంలో 1.40సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
Ramappa Temple: రామప్ప గొల్లాల గుడిలో దారుణం.. గుప్త నిధుల కోసం శిల్పాలు ధ్వంసం..