MLC Kavitha: కవిత పిటిషన్ పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

  • ట్రయల్ కోర్టులో కవిత సీబీఐ కేసు విచారణ వాయిదా..
  • ఛార్జ్ షీట్ ను తప్పుపడుతున్న కవిత తరపు న్యాయవాది..
  • గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి కావేరి బవెజా సీబీఐని ఆదేశం..
  • కవిత పిటిషన్ ను శుక్రవారం వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు..
Mlc Kavitha Rouse Court

Mlc Kavitha Rouse Court

MLC Kavitha: కవిత దాఖలు చేసిన పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారాని (జులై 12వ తేదీ)న వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై శుక్రవారం విచారణ జరపనుంది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి కావేరి బవెజా ఆదేశించారు. నేడు ట్రయల్ కోర్టులో కవిత సీబీఐ కేసు విచారణ జరిగింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై వేసిన ఛార్జ్ షీట్ ను కవిత తరపు న్యాయవాది తప్పుపట్టారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు.

Read also: Bandi Sanjay: పోలీసులను పట్టించుకోరా… సీఎం రేవంత్‌ కు బండి సంజయ్‌ లేఖ..

వాదనలు విన్న జడ్జి కావేరి బవెజా శుక్రవారాని పిటిషన్ ను వాయిదా వేశారు. కాగా, మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. తీహార్ జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే మద్యం కేసులో కవిత పాత్ర ఉందంటూ సీబీఐ పలు ఆధారాలతో ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కవిత ప్రమేయంపై నేడు విచారణ జరగనుంది. కాగా, ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ కోరుతుండగా.. బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తోంది.మధ్యంతర బెయిల్ కోసం కవిత తరఫు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాత్కాలిక బెయిల్ కోసం కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
MLC Kavitha: నేడు కవిత కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..