Site icon NTV Telugu

Road Accident: రోడ్డు దాటుతుండగా ఢీ కొట్టిన కారు.. MBBS విద్యార్థిని మృతి..

Accident

Accident

Road Accident: హయత్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థి ఐశ్వర్యని రోడ్డు దాటుతుండగా అతి వేగంతో వచ్చిన ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య మృతి చెందగా, ఆమె తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి ఐశ్వర్య మృతదేహాన్ని తరలించారు. ఇక, గాయపడిన ఆమె తండ్రిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Read Also: End of Year Sale: ఇయర్‌ ఎండ్‌ సేల్‌.. ప్రతి వస్తువుపై 70 శాతం వరకు తగ్గింపు..

ఈ సందర్భంగా ఎంబీబీఎస్ స్టూడెంట్ కుటుంబ సభ్యులు NTVతో మాట్లాడుతూ.. ఉదయం 7 గంటలకు హయత్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో మా కోడలు ఐశ్వర్య మృతి చెందగా, ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు.. ఐశ్వర్య ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతుంది.. మార్నింగ్ కాలేజ్ లో ఐశ్వర్యను డ్రాప్ చేసేందుకు తండ్రి తోడుగా వెళ్లాడు.. ఇక, వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది.. కారు ఐశ్వర్యను ఢీ కొట్టడంతో ఐశ్వర్య 10 మీటర్ల అవతల ఎగిరి పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Raj Kumar Goyal: చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా రాజ్ కుమార్‌ గోయల్‌ ప్రమాణం

అయితే, ఈ ప్రమాదంలో ఐశ్వర్య తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయని మృతురాలు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఐశ్వర్య సోదరుడు లండన్ లో చదువుతున్నాడు.. మా ఎంటైర్ ఫ్యామిలీలో ఐశ్వర్య టాలెంటెడ్.. మరి కొద్ది రోజుల్లో డాక్టర్ గా తను సమాజానికి సేవలు అందించేది.. కానీ, ప్రమాదంలో ఇలా మృతి చెందడం మా కుటుంబాన్నీ ఎంతగానో బాధిస్తోంది అన్నారు. ఇక, కారు నెంబర్ ను పోలీసులు ట్రేస్ చేశారు.. కారు నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version