Site icon NTV Telugu

Harish Rao: ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవు.. హరీష్‌ రావ్‌ ట్వీట్‌ వైరల్‌..

Harish Rao Revanth Reddy

Harish Rao Revanth Reddy

Harish Rao: రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్‌, ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పరిసరాల అపరిశుభ్రత కారణంగా ఎక్కడో ఒక చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారనే వార్తలు ఇటీవల హల్‌చల్ చేస్తున్నాయి. మరికొందరు ఎలుకలు కొరికి ఆస్పత్రి పాలయ్యారు. ఉపాధ్యాయుల కోరిక మేరకే ఆదిలాబాద్ జిల్లాలో 43 పాఠశాలలను మూసివేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ పనితీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. సారొస్తారా..! అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగులుతున్నదన్నారు. ఉపాధ్యాయులు లేక, విద్యా వాలంటీర్లను నియమించక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: Lorry Accident: లారీ ఢీకొని ఆరో తరగతి విద్యార్థి మృతి ఘటన.. వెలుగులోకి సీసీ ఫుటేజ్..

తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు, బడికి దూరమవుతున్నరని మండిపడ్డారు. విద్యాశాఖను కూడా తానే నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 8 నెలల్లో 500 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరగా, 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గురుకుల పాఠశాలల దుస్థితికి విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. ప్రతిపక్షాలపై దృష్టి సారించడం మానేసి విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
CM Revanth Reddy: కవిత బెయిల్‌పై చేసిన వ్యాఖ్యల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్

Exit mobile version