NTV Telugu Site icon

Harish Rao Arrest: పోలీసుల అదుపులో హరీష్‌రావు.. గచ్చిబౌలి పోలీస్టేషన్‌ కు తరలింపు..

Harish Rao

Harish Rao

Harish Rao Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్‌ రావు వెళ్లారు. ఇవాళ ఉదయం కౌశిక్‌ ఇంటి వద్దకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్‌ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అనుమతి లేదంటూ హరీష్‌ రావు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈనేపథ్యంలో పోలీసులు హరీష్‌ రావును అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి హరీష్‌ రావును గచ్చిబౌలి పోలీస్టేషన్‌ కు తరలించారు. దీంతో కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read also: Fake Beers: మహబూబ్ నగర్‌లో నకిలీ బీర్లు కలకలం..

నిన్న కౌశిక్‌ రెడ్డి పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐను అడ్డగించి, బెదిరించారని కౌశిక్‌ రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కౌశిక్‌ రెడ్డి సహా మరో 20 మందిపై కేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలో ఇవాళ బంజారాహిల్స్‌ లోని కౌశిక్‌ రెడ్డి ఇంటికి హరీష్ రావు రానున్నట్లు సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో కౌశిక్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కౌశిక్ ఇంటి వద్దకు వచ్చిన హరీష్‌ రావును పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ చెప్పడంతో హరీష్‌ రావు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కౌశిక్‌ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత, తోపులాట జరగడంతో పోలీసులు హరీష్‌ రావును అదుపులో తీసున్నారు. దీంతో హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ప్రశ్నించినా పోలీసులు హరీష్‌ రావును అదుపులో తీసుకుని గచ్చిబౌలి పోలీస్టేషన్‌ కు తరలించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు పోలీసులు తరలించారు.
World Bank: మహారాష్ట్రకు 188 మిలియన్ డాలర్లు.. ప్రపంచ బ్యాంక్ ఆమోదం