Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో 1,61,000 పోస్టులను భర్తీ చేసింది. కానీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు. 50వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు డబ్బా కొట్టుకొడుతున్నారు. మీరు చెప్పే 50 వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలోనే నోటిఫై చేసి, పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినవే కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలు ఇచ్చి, అవన్నీ తామే చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Hyderabad: శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
1. కాంగ్రెస్ మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది, కానీ ఈరోజుకి 10% కూడా పూర్తి చేయలేదు.
2. 2023 డిసెంబరు 9వ తేదీకి రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా, అర్హులైన రైతుల్లో సగానికి పైగా ఇంకా వేచి చూడాల్సిన దుస్థితి.
3. ప్రతి నెలా రూ. 4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా, 11 నెలల తర్వాత కూడా అమలు చేయలేదు.
4. 18 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు.
5. ప్రతి విద్యార్థికి రూ. 5 లక్షలతో విద్యా భరోసా కార్డు ఇస్తామన్న హామీ ఇంకా ప్రారంభం కాలేదు.
6. ప్రతి పంటకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, సన్న రకాలకు మాత్రమే పరిమితం చేసారు
7. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం హామీ ఉసేలేదు.
8. మహిళా విద్యార్థులకు ఎలక్ట్రిక్ వాహనాల హామీ గుర్తు కూడా లేదు.
Read also: Final list of voters: తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి కీలక ప్రకటన.. ఓటర్ల తుది జాబితాపై స్పష్టత..
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు నెరవేరతాయని చెప్పారు. కానీ, ప్రభుత్వం వచ్చి 300 రోజులు గడిచినా హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త హామీల సంగతి దేవుడెరుగు, బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను అటకెక్కించిందన్నారు.
1. రైతు బంధు
2. దళిత బంధు
3. బీసీ బంధు
4. కేసీఆర్ కిట్
5. పోషక కిట్
6. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్
7. బతుకమ్మ చీరలు.. ఇంకా ఎన్నో పథకాలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం తమ వైఫల్యాలను విజయాలుగా చూపించేందుకు విఫల యత్నాలు చేస్తూ దేశ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇది నిజంగా సిగ్గుచేటు! అని హరీష్ రావు అన్నారు.
KTR Tweet: ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..