Site icon NTV Telugu

Adilabad: పోలీసుల అదుపులో తుపాకులు సరఫరా చేసే ముఠా..!

Adilabad Guns

Adilabad Guns

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తుపాకులు సరఫరా చేసే ముఠాను పోలీసుల అదుపులో తీసుకున్నారు. 4 తుపాకులు తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటపై ఎలాంటి సమాచారం లేకుండా.. గోప్యంగా ఉంచి విచారణ చేపట్టినట్లు సమాచారం. ఓ పోలీస్ స్టేషన్ లో తుపాకుల అప్పగించి, అదుపులో తీసుకున్న ఇద్దరిని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అక్రమ ఆయుధాలు ఎక్కడికి తీసుకెళ్ళుతున్నారు. ఎవ్వరికి తీసుకెళ్లుతున్నారు.. ఎందుకు తీసుకెళ్తున్నారనే దాని పై పోలీసులు విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పర్ వాడ టోల్ ప్లాజా సమీపంలో పక్కా సమాచారంతో తుపాకులు తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు తెలుస్తుంది. కాగా.. పిప్పర్ వాడ టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై జిల్లా పోలీసులకు ప్రశ్నించగా స్పందించేందుకు నిరాకరించారు. అయితే తుపాకులు తరలిస్తున్న ముఠాను అదుపులో తీసుకున్న వారి వివరాలు ఎందుకు గోప్యంగా వుంచి విచారణ జరుపుతున్నారనే దానిపై పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అదుపులో వున్న ఆ ఇద్దరు ఎవరు? వారు ఏ ప్రాంతానికి చెందిన వారు? అనే దానిపై కూడా పోలీసుల వద్ద నుంచి ఎటువంటి స్పందించలేదు. అదుపులో తీసుకున్న వీరిద్దరిని వివరాలు అంత గోప్యంగా ఉంచి విచారణ ఎందుకు చేస్తున్నారనే దానిపై స్థానికంగా చర్చకు దారితీస్తుంది.
President Droupadi Murmu: నేడు శిల్పారామంలో లోక్‌ మంథన్‌ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి

Exit mobile version