Telangana Govt: గ్రూప్-1 పరీక్షల రద్దుపై తెలంగాణ రాజకీయం హీటెక్కింది. జీవో 29ను రద్దు చేయాలంటూ గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన కొనసాగుతోంది. ఒకవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద బీఆర్ఎస్ మరోవైపు అశోక్ నగర్ వద్ద బీజేపీ ఆందోళనతో రణరంగంగా మారింది. గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. చివరకు గ్రూప్ -1 అభ్యర్థులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ సమావేశమయ్యారు. గ్రూప్ 1 రద్దు చేయాలని మంత్రులను అభ్యర్థులు కోరారు. మంత్రుల గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లపై చర్చించారు. గ్రూప్1 అభ్యర్థుల డిమాండ్లపై నేడు ప్రభుత్వం సమగ్ర ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
మరి గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తారా? లేక రేపటి నుంచి అంటే (సోమవారం 21) నుంచి అనుకున్న విధంగానే పరీక్షలు కొనసాగిస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తే ఇప్పటికే దాదాపు 90 శాతానికి పైగా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్న అభ్యర్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.. రేపటి నుంచి (సోమవారం 21) నుంచి గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తే మిగతా 10శాతం మంది అభ్యర్థులు అనుకున్నది సాధించినట్లే. దీనివల్ల 90 శాతం మంది నష్టపోతే 10 శాతం మందికి మాత్రమే ఫలితం ఉంటుంది. మరి దీనిపై 90 శాతం అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇన్ని రోజులుగా గ్రూప్ 1 పరీక్షలు ప్రిపరేషన్ అయి ఇప్పుడు తీరా పరీక్షలు రాసే సమయంలో వాయిదా వేస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం ఇచ్చే తీర్పులు భవిష్యత్ ఉంటుంది.
Kadapa Crime: ప్రేమపేరుతో పెట్రోల్ పోసి నిప్పు.. చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి