NTV Telugu Site icon

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే…?

గ‌తకొన్ని రోజులుగా పేరుగ్గుతూ తగ్గుతూ పుత్త‌డి ధ‌ర‌లు ఈరోజు స్థిరంగా పెరిగాయి. ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డ‌తాయ‌ని అనుకున్న వినియోగ‌దారుల‌కు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవ‌డంతో ధ‌ర‌ల్లో నిరంతరం తేడాలు ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర 45,500 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.49,630 కి చేరింది. ఇక బంగారం స్థిరంగా ఉండగా వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.600 తగ్గి రూ.75,900కి చేరింది.