GHMC Commissioner: నగరంలో రెడ్ అలెర్ట్.. ప్రజలకు ఆమ్రపాలి సూచన..
- నగరంలో రెడ్ అలెర్ట్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
- జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Commissioner: నగరంలో రెడ్ అలెర్ట్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. సిటీలో 141 వాటర్ లాగింగ్ పాయింట్ ల వద్ద స్టాటిక్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఎప్పటికప్పుడు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకూడదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
హైడ్రా జిహెచ్ఎంసి సమన్వయంతో పని చేసి ఎవ్వరికీ సమస్యలు రాకుండా చూస్తామన్నారు. నగరంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షం తగ్గేవరకు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. రోడ్లపై ఏర్పడ్డ గుంటలతో ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా జిహెచ్ఎంసి సిబ్బంది పనిచేస్తుందన్నారు. ప్రజలకు అత్యవసరమైతే 040 21111111, 9000113667 నెంబర్ ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!