ఎప్పడూ రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలో మరింత ఆక్సిజన్ లెవెన్స్‌ను పెంచడానికి జీహెచ్‌ఎంసీ మరోసారి ముందుకు వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పచ్చదనాన్ని పెంచేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షలకు పైగా మొక్కలు ఏర్పాటు చేస్తూ గ్రీన్ కవర్‌ను పెంచుతోంది. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’ను ప్రపంచంలోనే అడవుల పెంపకంలో మూడవ అతిపెద్ద ప్రయత్నంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.
అయితే ‘తెలంగాణకు హరితహారం-2022’లో భాగంగా, మరిన్ని మొక్కలు నాటడం ద్వారా నగరాన్ని పచ్చదనంతో నింపాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 120 లక్షల మొక్కలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
