MLA KrishnaMohan Reddy: గద్వాల బీఆర్ఎస్ మ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో.. జోగులాంబ గద్వాల్ నుంచి కృష్ణమోహన్ హైద్రాబాద్ కు బయలుదేరారు. అనంతరం రేవంత్ రెడ్డి తో భేటీ కానున్నారు. అనంతరం హస్తం పార్టీలో చేరనున్నారు. అయితే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని నిన్న సీఎం రేవంత్ రెడ్డికి కలిసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, సరిత భేటీ జరిగినా కృష్ణమోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారనే వార్త సంచలనంగా మారింది. అయితే అధిష్టాన పెద్దలు మాత్రం సరితను బుజ్జగించే పనిలో వున్నట్లు సమాచారం.
Read also: Virat Kohli: విరాట్ కోహ్లీ మొబైల్ వాల్‌పేపర్‌గా ఆయన ఫోటో.. ఎవరీయన?
స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య మధ్య గత కొంతకాలంగా రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రెండూ వేర్వేరు పార్టీలే అయినప్పటికీ గద్వాల నియోజకవర్గంపై ఇరువురి మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సరిత మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అధికారులు ఎవరికి వారుగా వ్యవహరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారనే చర్చ సాగుతోంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ప్రొటోకాల్ వివాదాలు రాజుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జెడ్పీ చైర్‌పర్సన్ సరిత సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాకను సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Hyderabad Bonalu: జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..