Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Gaddam Prasad As Speaker Ts Assembly Declared Protem Speaker

TS Assembly: అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌.. స్వయంగా ఛైర్ లో కూర్చోబెట్టిన సీఎం

Published Date :December 14, 2023 , 12:19 pm
By Bhanu
TS Assembly: అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌.. స్వయంగా ఛైర్ లో కూర్చోబెట్టిన సీఎం
  • Follow Us :
  • google news
  • dailyhunt

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. గురువారం శాసనసభ ప్రారంభమైన అనంతరం స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్‌గా నియమితులైన గడ్డం ప్రసాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, అన్ని పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ ప్రసాద్‌తో ప్రమాణం చేయించారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనే స్వయం వెళ్లి గడ్డం ప్రసాద్ ను స్పీకర్ ఛైర్ లో కూర్చోబెట్టారు. ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం సహా ఇతర సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అసెంబ్లీ మంచి సంప్రదాయానికి నాంది పలికిందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు.

Read also: Smriti Irani : మహిళలకు వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ ఇవ్వకూడదు : స్మృతి ఇరానీ

ఈ సందర్భంగా సభలో స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన మంత్రులు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సభకు తెలియజేశారు. తొలుత స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ను అభినందించారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. పేదల సమస్యలు తెలిసిన ప్రసాద్ కుమార్ అన్నారు. రాష్ట్ర సమస్యలపై పెద్దఎత్తున చర్చించేందుకు సభ్యులకు మరింత సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. శాసనసభలో జరిగే చర్చలు అర్థవంతంగా ఉంటాయన్న నమ్మకం ఉందన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అంచెలంచెలుగా ఎదిగి నేడు స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలిపారు. శాసనసభలో మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుతారని స్పీకర్‌పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. స్పీకర్‌కు మద్దతు తెలిపిన ప్రతిపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ నిర్ణయాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. తన తండ్రి శ్రీపాదరావు కూడా అదే శాసనసభలో పనిచేసి ఆ పీఠాన్ని ఎక్కించారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు.
Jigarthanda Double X: ఇండియన్ సినిమాని చూడబోతున్న హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assembly Speaker
  • Gaddam Prasad
  • protem speaker
  • telangana cm revanthreddy
  • ts assembly

తాజావార్తలు

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

  • Minister Subhash Father: 15 మంది రౌడీలతో దారుణంగా కొట్టాడు.. మంత్రి వాసంశెట్టి తండ్రిపై మాజీ సర్పంచ్ సంచలన ఆరోపణలు!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions