NTV Telugu Site icon

Tank Bund Updates: ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..

Tank Bund Updates

Tank Bund Updates

Tank Bund Updates: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవనరావు విగ్రహం వరకు గణేష్‌ విగ్రహాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వరకు గణేష్‌ విగ్రహాలు బారులు తీరాయి. నారాయణగూడ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వస్తున్న గణేష్‌ విగ్రహాలను పోలీసులు సింగిల్‌ లైన్‌లో అనుమతించారు. మరో గంటలోపు సాధారణ ట్రాఫిక్‌కు అనుమతించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అధికారులు వన్ వేలో అనుమతించారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి.

Read also: Palanje Ganesh Temple: 75 ఏళ్లుగా అక్కడి వినాయకుడికి నో నిమజ్జనం.. చివరి రోజు ఏం చేస్తారంటే?

నిన్నటి నుంచి ట్యాంగ్ బండ్ పై గణపతి విగ్రహాలు నిమజ్జనానికి భారీగా వస్తున్నాయి. దీంతో ఖైరతాబాద్, లక్డీకపూల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నేడు పనిదినం కావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ మార్గ్‌కు ఒకవైపు రోడ్డును క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గణపతి విగ్రహాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు తరలిస్తున్నారు. అలాగే విగ్రహాలను నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోని మరో రహదారిపైకి మళ్లిస్తున్నారు. సాధారణ వాహనాల రాకపోకలకు పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇంకా ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి ఐదు వేల వరకు విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిమజ్జన ప్రక్రియను జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి పరిశీలిస్తున్నారు. బల్దియా కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Jr. NTR : యంగ్ టైగర్ – వెట్రి మారన్ – Sun పిక్చర్స్.. ఫిక్స్..?

Show comments