NTV Telugu Site icon

Prabhakar Rao: టచ్‌ లో ఉంటా.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావు లేఖ..

Prabhakar Rao

Prabhakar Rao

Prabhakar Rao: జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావు లేఖ రాశారు. జూన్ 26వ తేదీన ఇండియాకు వచ్చేది ఉండేది.. కానీ నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చింది ..క్యాన్సర్ తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నాను. అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను.. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పూర్తి అసత్యమైన ఆరోపణలు నాపై చేస్తున్నారు.. నేను ఎక్కడ కూడా ఇల్లీగల్ పనులు చేయలేదు.. పోలీసులకు ఈ దర్యాప్తులో సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ..నేను ఇండియాకు వచ్చేవరకు టెలికాన్ఫరెన్స్ లేదా మెయిల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాను ..నేను క్రమశిక్షణ గల ఒక పోలీసు అధికారిని,.. విచారణను ఎదుర్కొంటాను ఎక్కడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి లేదు.. నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేనే ఇండియాకు వస్తాను.. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని వాట్స్అప్ కాల్ ద్వారా చెప్పను.. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని మొత్తం కూడా విచారణ అధికారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.

Read also: Sangareddy: చిన్నారుల పాలిట యమదూతలుగా మారుతున్న డేంజర్ డాగ్స్..

ప్రభాకర్ రావు ఎవరు?

1960 జూన్ 25న జన్మించిన ప్రభాకర్ రావు 1991లో ఐపీఎస్ అధికారిగా కెరీర్ ప్రారంభించారు. 2001 నుంచి తెలంగాణ కేడర్‌లో పనిచేశారు. 2019లో తెలంగాణ పోలీస్‌లో ఐజీగా పదోన్నతి పొందారు. మనీ కంట్రోల్ ప్రకారం, అతను అమెరికాకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతను 2020లో పదవీ విరమణ చేసాడు మరియు గత సంవత్సరం నవంబర్‌లో OSD, ఇంటెలిజెన్స్ (SIB) గా నియమితులయ్యారు. డిసెంబరు 4న, సాక్ష్యాలను తొలగించిన రోజుగా అనుమానిస్తున్నారు, రావు తన పదవికి రాజీనామా చేశారు. సిటీ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న మరో అధికారి రాధా కిషన్‌రావు పేరు కూడా ఉంది. అతని కోసం కూడా లుకౌట్ నోటీసు జారీ చేశారు పోలీసులు. కుంభకోణం వెలుగులోకి రావడంతో ప్రభాకర్ యూకేకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురు తెలంగాణ పోలీసు అధికారులను విచారిస్తున్నారు. అయితే దీనిపిఐ ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాయడంతో ప్రభాకర్ ఎక్కడ వున్నాడనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.
Kiran Abbavaram: ఆ సినిమా రైట్స్ కోసం పోటీ.. ఎవరికి దక్కేనో..?