NTV Telugu Site icon

B.Vinod Kumar: కేసీఆర్ అసెంబ్లీ కి వస్తారు..

B. Vinod Kumar

B. Vinod Kumar

B.Vinod Kumar: కేసీఆర్ అసెంబ్లీ కి వస్తారని.. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ చురుకైన పాత్ర పోషిస్తుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కేంద్రంలో ఈసారి బీజేపీ కి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదన్నారు. ఎన్డీయే కూటమి లో ఉన్న టీడీపీ భాగస్వామ్యం తో ప్రభుత్వం ఏర్పాటు అయిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈ మద్య కేంద్ర పెద్దలను కలిసి కొన్ని విన్నపాలు చేశారని గుర్తుచేశారు. షెడ్యూల్ 13 లో ఉన్న అంశాలను ఆరు నెలల్లో పూర్తి చేయాలని హెచ్చరించారు అని వార్తలు వచ్చాయన్నారు. ఏపీ కి 65 వేల కోట్ల ఆయిల్ రిఫైనరీ సంస్థలు ఇస్తాం అని కేంద్రం హామీ ఇచ్చింది అని ప్రచారం జరుగుతోందని గుర్తుచేశారు. అదే షెడ్యూల్ 13 లో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వట్లేదన్నారు.

Read also: MLA Maheshwar Reddy: కొడంగల్ ఎత్తివేతల పథకానికి గ్లోబల్ టెండర్లు పిలవాల్సిందే..

ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్ ప్రజలు నలభై ఏళ్ళు గా కొట్లాడుతున్నారని తెలిపారు. కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు చెప్పాలి? అని ప్రశ్నించారు. నిన్న జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై అసలు మాట్లాడ లేదన్నారు. రాబోయే బడ్జెట్ లో కాజీపేట రైల్వే ఫ్యాక్టరి కి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తొమ్మిది మంది కాంగ్రెస్ లో చేరికపై వినోద్ కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం దురదృష్టకరం అన్నారు. ఎన్నికల సమయానికి వాళ్ళు మళ్ళీ మా పార్టీ లోకి వచ్చినా… వారిని ప్రజలు ఆదరించరని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీ కి వస్తారని.. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ చురుకైన పాత్ర పోషిస్తుందని తెలిపారు.
Miyapur Crime: అపార్ట్‌ మెంట్‌ నుంచి దూకిన యువతి.. మియాపూర్ లో ఘటన..