Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సుమారు 20 లే- అవుట్లకు గాను 5000 ప్లాట్లు మురికి నీటితో నిండి పోయి ఉందన్నారు. నిజాంల కాలంలో 93 ఎకరాలు ఉన్న అమీన్ పూర్ పెద్ద చెరువు మురుగు నీటితో నిండి 465 ఎకరాలుగా మారి తమ ప్లాట్లను కబ్జా చేసిందని వాపోతున్నారు. 15 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసినప్పటికీ మా పనిలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా అలసత్వం కనబరు స్తున్నదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Delhi: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం.. మహేశ్‌కుమార్ ఎన్నిక
ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి మా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేలా చేసి న్యాయం చేయాలని ప్లాట్ల ఓనర్స్ విజ్ఞప్తి చేశారు. అలాగే, తక్షణమే మా ప్లాట్లలో ఉన్న నీటిని బయటకు పంపించి ఇళ్ల నిర్మాణానికి సహకరించగలరని కోరారు. దీంతో పాటు అమీన్ పుర్ పెద్ద చెరువుకు అలుగులు నిర్మించి, మెయింటెన్ చేసి నీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపాలిటీ ఆఫీస్ సిబ్బందికి ప్లాట్ల ఓనర్స్ జేఏసీ సభ్యులు మెమోరాండం అందజేశారు.