NTV Telugu Site icon

హైదరాబాద్ లోని నారాయణగూడలో అగ్నిప్రమాదం… 

హైద‌రాబాద్‌లోని నారాయ‌ణ‌గూడాలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.  నారాయ‌ణ‌గూడాలోని అవంతి న‌గ‌ర్‌లో ఓ ఇంట్లో అర్ధ‌రాత్రి స‌మయంలో స‌డెన్ మంట‌లు చెల‌రేగాయి.  ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో ఆ ప్రాంతం మొత్తం ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకున్నాయి.  వెంట‌నే స్పందించిన పోలీసులు ప్ర‌మాదంలో చిక్కుకున్న ఐదుగురిని కాపాడి స‌మీపంలో ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  అయితే, ఈ ఆగ్ని ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందార‌ని పోలీసులు పేర్కొన్నారు.  ఇక‌, ఈ అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణ‌మా లేదంటే మ‌రేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.