NTV Telugu Site icon

Telangana Secretariat: నేటి నుంచి సెక్రటేరియట్‌లో అటెండెన్స్.. లేటుగా వస్తే లాసేనా..

Secretariat

Secretariat

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో నేటి నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. దీంతో ఉదయం 10 గంటలకే ఉద్యోగులు సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెక్రటేరియట్ హెడ్ అకౌంట్ నుండి జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వర్తిస్తుందని తెలిపారు. సమయం సందర్భం లేకుండా.. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధులకు వస్తున్నారని, వారి సమయానికి వెళ్లిపోతున్నారని ఆరోపణల వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సీఎస్‌ ప్రవేశపెట్టారు. సెక్రటేరియట్‌ లోకి ప్రవేశించే అన్ని పాయింట్ల వద్ద ఈ పరికరాలను అమర్చారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఫేక్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.

Read also: Gold Rate Today: మూడు రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్.. నేడు తులం బంగారం ఎంతుందంటే?

అధికారులు, ఉద్యోగులు, రెగ్యులర్ సిబ్బందితో పాటు సచివాలయ హెడ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ ద్వారా వేతనాలు పొందుతున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కూడా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతి ఒక్కరు ఇన్ టైం.. ఔట్ టైం అటెండెన్స్ తప్పనిసరి అంటూ సీఎస్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ అటెండెన్స్‌ సెక్రటేరియట్ హెడ్ అకౌంట్ నుంచి జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే.. ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ పై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

Read also: Syriya-Israel: సిరియాలో 80 శాతం అస్తులు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడి

వీరందరూ ఇవాల్టి నుంచి ఇన్‌ టైం.. ఔట్‌ టైం వేయకుండా వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై అనుమానం వ్యక్తమతున్నాయి. ఒక వేలా ఉద్యోగులు లేటుగా వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన వలసి వస్తుందో? అనే అనుమం మొదలైంది. సచివాలయంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంతా కలిపి సుమారు 2500 మందికి పైగా ఉంటారని అంచనా. అటెండెన్స్‌ విధానంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రవీణ్ కుమార్, సరిత అనే ఇద్దరు కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా సమాచారం ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే లేట్ గా వస్తే జీతం కట్ చేస్తారా? లేదా? అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Read also: Avanthi Srinivas Resign To YCP: వైసీపీకి రాజీనామా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అవంతి

దీంతో మొన్నటి వరకు సమయం సందర్భం లేకుండా ఇష్టాను సారంగా సచివాలయానికి వచ్చిన వారందరికి ఈ నిబంధన ఇబ్బందే అని చెప్పాలి. ఒకవేళ లేట్‌ గా వచ్చిన వారికి జీతం లాస్‌ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? అనే అనుమానం పెరిగింది. అయితే ఎవరైనా సరే అటెండర్స్ ప్రకారం నెలకు జీతం కట్ అవకుండా.. పూర్తీ సాలరీ అందుకోవాలంటే సెక్రటేరియట్‌ కు సమయానికి పరుగులు పెట్టాల్సిందే. మరి ఆలస్యంగా వచ్చే వారికి సాలరీ కట్‌ అవుతుందా? లేదా? అనేది వచ్చే నెల జీతం అకౌంట్ లో పడేంత వరకు వేచి చూడాల్సిందే..
Pushpa 2 The Rule : పార్టీ ఉంది పుష్ప.. టీం సక్సెస్ పార్టీ అదిరింది!

Show comments