Site icon NTV Telugu

Ponnam Prabhakar: తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చాం..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: హైదరాబాద్, తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి మేరకు ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్ & తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చామన్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉందన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామన్నారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చేపించాలని అన్నారు. హైబ్రిడ్ వాహనాలపై కూడా పన్ను రాయితీపై ఆలోచిస్తున్నామన్నారు. ప్రజలు ఈవీ వాహనాలు కొనండి అన్నారు. రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఆదేశాలు కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
Minister Payyavula Keshav: 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధం..

Exit mobile version