NTV Telugu Site icon

Etala Rajender: బ్యాంకులు షరతులు లేకుండా పేదలకు రుణాలు ఇవ్వాలి..

Etala Rajender

Etala Rajender

Etala Rajender: పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈదేశంలో తెల్లరేషన్ కార్డు సంఖ్య తగ్గాలన్నారు. ఉచితాలు వద్దు మేం బ్రతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలని తెలిపారు. దేశం అటువైపు వెళ్ళాలి.. ప్రజలు వారి కాళ్ళ మీద బ్రతికే దిశగా ఎదగాలన్నారు. పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్. విద్యానగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అని తెలిపారు. ఆడపిల్లలు కూడా సమాజంలో సమానంగా ఎదుగుతున్నారని అన్నారు. తిండికి లేకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారని అన్నారు. భారతదేశం యువశక్తి గల దేశం.. ఆ యువశక్తి పాన్ డబ్బాల దగ్గర ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ట్రైనింగ్ ఇప్పిస్తుందని తెలిపారు. ప్రోత్సాహకాలు అందిస్తుందని.. నా తపన కూడా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అన్నారు. స్వయంశక్తి మీద బ్రతికేలా చేయడం అని తెలిపారు. పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. పెద్దలు బ్యాంక్ రుణాలు ఎగ్గొడుతున్నారేమో కానీ మన మహిళా సంఘాలు 98 శాతం రిపేమెంట్ చేస్తున్నాయన్నారు.

Read also: Hyderabad: నేష‌న‌ల్ పోలీసు అకాడ‌మీలో 76వ ఐపీఎస్ ప్రొబేష‌న‌ర్ల అవుట్ ప‌రేడ్..

నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. ప్రాచీన వృత్తులు కాపాడుకోవాలి. దీనికోసం నేను మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఆరాటపడ్డానని తెలిపారు. వృత్తి పనులు చేసే వారు సమాజం మేలు చేసేవారన్నారు. చేతి వృత్తుల వారు జీవితాలను త్యాగం చేసి మానవ కళ్యాణానికి తోడ్పడే వాళ్ళు. వారికి ఏం ఇచ్చినా తక్కువే అన్నారు. చేతి వృత్తుల వారి పట్ల మన మైండ్ సెట్ మారాలి. వారిపట్ల చిన్న చూపు తగదన్నారు. ఆపదలో ఉన్నవాడికి అవసరం ఉన్నవాడికి సాయం చేసేవాడే నిజమైన మనిషి అని తెలిపారు. 77 సంవత్సరాల తరువాత కూడా ఈ దేశంలో పేదరికం ఉంది, ఆకలి ఉందనే ప్రధాని నరేంద్ర మోడీ గారు పీఎం విశ్వకర్మలాంటి స్కీంలు తీసుకువచ్చారన్నారు. ఈదేశంలో తెల్లరేషన్ కార్డు సంఖ్య తగ్గాలన్నారు. ఉచితాలు వద్దు మేం బ్రతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలన్నారు. దేశం అటువైపు వెళ్ళాలి.. ప్రజలు వారి కాళ్ళ మీద బ్రతికే దిశగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ పూర్తి చేసినవారికి సర్టిఫికెట్లు అందించారన్నారు.
Hyderabad Student: ఫిలిప్పీన్స్ లో నిజామాబాద్ విద్యార్థి మృతి..

Show comments