NTV Telugu Site icon

Eatala Rajendar: బట్టలు లేవు కానీ బంగారం కొనిస్తా అన్నట్టుంది.. హైడ్రా నోటీస్ ల పై ఈటల సెటైర్లు..

Etala Rajender

Etala Rajender

Eatala Rajendar: బట్టలు లేవు కానీ బంగారం కొనిస్తా అన్నట్టుంది.. హైడ్రా నోటీస్ లపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం పేదల ఇళ్లను కూలగొట్టారని మండిపడ్డారు. ఆయనకు వారి ఉసురు తగిలింది అన్నారు. పేదలతో పెట్టుకున్నవారు, పేదల కళ్ళలో నీళ్లు చూసేవారికి ఎప్పుడు మంచి జరగదన్నారు. పోయేకాలం వచ్చినట్టుంది కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. శని, ఆదివారాలు చూసుకొని కూలగొడుతున్నారని మండిపడ్డారు. నిజాం కంటే దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో పేదలు కంటిమీద కునుకు లేకుండా బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీ కరణ చేస్తారట ! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బట్టలు లేవు కానీ బంగారం కొనిస్తా అన్నట్టుందని మండిపడ్డారు. మేక వన్నె పులులు ఎన్నికలప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ ఓట్లు అడిగారని అన్నారు.

మీరు ఆందోళన పడవద్దు.. నేను ఉన్నంతవరకు మీ పక్షాన కొట్లాడుతానని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడానికి ఆరేళ్ల సమయం పడితే.. రేవంత్ రెడ్డి పాలన తెలుసుకోవడానికి కేవలం ఆరు నెలల్లోనే తెలిసిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హై డ్రామా చేస్తుందని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తానంటూ, స్థానికుల గూడు చెదరగొట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. అల్వాల్ జొన్న బండలో ఏడు దశాబ్ద కాలాల నుండి, ఉన్న వడ్డెర వర్గానికి చెందిన వారికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందని, ఈ నోటీసులకు ఎవరు భయపడవలసిన అవసరం లేదని తాను అండగా ఉంటానని అక్కడ ఉన్న వారికి హామీ ఇచ్చారన్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు చూసుకుని నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా కూల్చివేతలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కోసమే ఉంటది, ఇందిరమ్మ ఇల్లు కట్టించమనే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, పెదాలు కట్టుకున్న ఇళ్లకు MRO లతో నోటీసులు ఇప్పించడం బాధాకరమని తెలిపారు.
Hyderabad Crime: పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నాడు.. యువకుడి ఇంటి ముందు బాధితురాలు ధర్నా..