MLA Mahipal Reddy: పీఎంఎల్ఏ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చెందిన 1.2 కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో ఉంది. పటాన్‌చెరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఎమ్మెల్యే పేరిట రిజిస్టరైన లాకర్లలో సుమారు కోటి రూపాయల విలువైన బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడు జి.మధుసూధన్‌రెడ్డి తదితరుల మైనింగ్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ కొనసాగుతుంది. ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్లకు రశీదులు, పత్రాలు లేవని ఈడీ గుర్తించింది.
దేశీయ మార్కెట్ నుంచి బంగారం దిగుమతి చేసుకోలేదని ఈడీ విచారణలో తెలిపింది. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విక్రమ్‌రెడ్డి, సోదరుడు మధుసూధన్‌రెడ్డి, వివిధ బినామీలకు చెందిన 100 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఎమ్మెల్యే, ఆయన కుమారుడి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. రూ.300 కోట్ల విలువైన లోహాలు, ఖనిజాలను అక్రమంగా దోపిడీ చేశారంటూ పటాన్‌చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే సోదరుడు గతంలో అరెస్టయ్యాడు. మరోసారి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
IBPS CLERK RECRUITMENT 2024: నిరుద్యోగులకు భారీ రిక్రూట్మెంట్.. 6,218 బ్యాంక్ పోస్టులకు నోటిఫికేషన్..