Site icon NTV Telugu

ED Notice to Malla Reddy: మాజీ మంత్రి మాల్లారెడ్డి కి బిగ్ షాక్.. ఈడీ నోటీసులు..

Chamakura Malla Reddy

Chamakura Malla Reddy

ED Notice to Malla Reddy:మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. మల్లారెడ్డికి ఇవాళ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలు పై నోటీసులు ఇచ్చినట్లు ఈడీ పేర్కింది. గత ఏడాది జూన్ లో ఈడీ అధికారులు మాజీ మంత్రి మల్లారెడ్డి మెడికల్ కళాశాలలపై సోదాలు నిర్విహించిన విషయం తెలిసిందే. సుమారు 12 మెడికల్‌ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి అమ్మకున్నట్లు ఈడీ గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు. కానీ.. ఈడీ నోటీసుల్లో ఇంకా ఎలాంటి విషయాలు పేర్కొంది? తదితర అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Mallu Bhatti Vikramarka: మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నాం..

Exit mobile version