NTV Telugu Site icon

SR Nagar Hostel: ఎస్ ఆర్ నగర్ లో హాస్టల్ లో డ్రగ్స్ కలకలం..

Sr Nagar Drogs

Sr Nagar Drogs

SR Nagar Hostel: ఎస్సార్ నగర్ లో హాస్టల్స్ కేంద్రంలో గంజాయి, డ్రగ్స్ గుట్టు రట్టయింది. దీంతో ఎస్సార్ నగర్ లోని వెంకట్ బాయ్స్ హాస్టల్లో ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు చేసింది. ఈ సోదాల్లో హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హాస్టల్ లో పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారుగా 12 లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 250 గ్రాముల గంజాయి ,115 గ్రాముల ఎం.డి.ఎం.ఏ డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని ముగ్గురు కీలక వ్యక్తులు మోహిత్ రావు, పసుపులేటి, రవూఫ్ లను అరెస్టు చేశారు. బెంగళూరు నుండి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో అమ్మకాలు కొనసాగిస్తున్నారని గుర్తించారు. రవూఫ్ కు నైజీరియా కు చెందిన నెగ్గెన్ వ్యక్తితో సంబంధం ఉండటంతో డ్రగ్స్ ను సరఫరా చేస్తూ.. హాస్టల్‌ లో కూడా అమ్ముతున్నట్లు గ్రహించారు.

Read also: Harish Rao: ఆయకట్టుకు నీళ్లు అందించండి.. ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ..

దీంతో పోలీసులకు కొందరు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంకట్ బాయ్స్ హాస్టల్లో సోదాలు చేయగా డ్రగ్స్‌, గంజాయి కథ వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కాలని ప్రెసిడెంట్ నిర్ఘాంత పోయారు. హాస్టల్స్ లో డ్రగ్స్ దొరకడం మొదటిసారి వింటున్నామని షాక్‌ అయ్యారు. హాస్టల్స్ లో గదులు అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హాస్టల్ లోకి కొత్త వ్యక్తుల రాకుండా చూసుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి చదువుకోవడం, ఉద్యోగాలు చేసుకోవడం చేస్తుంటారని అన్నారు. కొంత మంది మూలంగా వీరందరి భవిష్యత్ చీకటి మాయం అవుతుందని తెలిపారు. పబ్‌లు, హోటల్స్‌లో డ్రగ్స్ విన్నాము, ఇప్పుడు ఏకంగా హాస్టల్ వరకు విస్తరించిందంటే చాలా ప్రమాదంగా మారిందని దీనిపై భయాందోళన చెందామని తెలిపారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలనికోరారు.
Employment: వ్యవసాయ రంగంలో 25 కోట్ల మందికి ఉపాధి.. 17 ఏళ్లలో అత్యధికం

Show comments